Mansoon hairfall | ఇటీవలి కాలంలో వెంట్రుకలు ఊడిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. అందులో వానాకాలంలో మరీ ఎక్కువగా ఉండటంతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం కారణంగా జుట్టు పెళుసుగా, నిర్జీవంగా మారి ఊడిపోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాధారణంగా రోజుకు 60 నుంచి 70 వెంట్రుకలు రాలిపోతుండగా.. వానాకాలంలో ఇది 30 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు 500 వరకు ఊడిపోతుంటాయి. ఈ జుట్టు రాలే సమస్య ప్రధానంగా నెత్తిమీద గరుకుదనం, చుండ్రు వల్ల వస్తుంది.
బిజీ లైఫ్ స్టైల్ కారణంగా నిత్యం వాతావరణాన్ని బట్టి జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో జుట్టు రాలడం అనే సమస్యను అధిగమించవచ్చు. జుట్టు రాలే సమస్యకు డైట్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. నిత్యం తినే పదార్థాల్లో జింక్, ఇనుము, ఫోలిక్‌యాసిడ్లు ఉండేలా చూసుకోవాలని సెలవిస్తున్నారు. అలాగే. ఏ విటమిన్ ఎక్కువగా ఉండే చిలగడదుంప, పాలకూర, క్యారెట్లు, పాలు, గుడ్లు తీసుకోవాలి. వీటితో పాటు డీ విటమిన్ అధికంగా లభించే చేపలు, పుట్టుగొడుగులు వంటివి తినాలి. తృణధాన్యాలు, బాదం, మాంసం, చేప, ఆకుకూరల్లో బయోటిన్ దొరుకుతుంది. స్ట్రాబెర్రీలు, కమలాలు, జామకాయలు వంటి పండ్లలో సీ విటమిన్ దొరుకుతుంది. ఈ విటమిన్, ప్రొటీన్ లభించే పనీర్, పొద్దు తిరుగుడు గింజల్నీ తరచూ తింటే వెంట్రుకలకు బలం చేకూరుతుంది.
హెయిర్‌ఫాల్ ఆగాలంటే..
మెంతులను కొన్ని తీసుకుని గోరువెచ్చటి కొబ్బరినూనెతో కలిపి చల్లారబెట్టాలి. అనంతరం వెంట్రుకల కుదుళ్ల వరకు అంటేలా మసాజ్ చేసి రాత్రంతా అలా వదిలేయాలి. రాత్రి భోజనంలోకి కిచ్డీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గుమ్మడికాయ వంటకాలను ఆహారంలో తీసుకోవాలి. మెంతులు పీసీఓడీ సమస్యకు చెక్ పెడుతుంది.
అలీవ్ విత్తనాలు కూడా వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతాయి. అలీవ్ విత్తనాలను నానబెట్టి రాత్రి వేళ పాలతో తినాలి. ఇలా తినడం ఇబ్బందికరంగా ఉంటే వాటికి కొబ్బరి, నెయ్యి కలిపి లడ్డూ మాదిరిగా చుట్టి తినొచ్చు. కీమో చికిత్స కారణంగా ఊడిపోయే జుట్టును కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
వానాకాలంలో వెంట్రుకల సంరక్షణలో జాజికాయ గ్రేట్‌గా ఉపయోగపడుతుంది. జాజికాయ పొడిని పాలలో చిటికెడు వేసి తీసుకోవాలి. వీటిలో లభించే విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియంలు జట్టు రాలకుండా, క్షీణతను నివారిస్తాయి.
ఈ రెసిపీల్లో వాడే నెయ్యి, పసుపు, పెరుగుతో కూడా లాభాలున్నాయి. నెయ్యి తీసుకోవడం వల్ల కొవ్వులు అందుతాయి. పసుపు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగుతో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా లభిస్తుంది.
సాధారణ నియమాలు..