సాంకేతికత ఎంత ‘స్మార్ట్’గా మారినా, ఎన్ని ఏఐ అసిస్టెంట్లు వచ్చినా.. అన్నీ స్మార్ట్‌ఫోన్‌కే అనుసంధానమై ఉంటాయి. దాంతో, ఏ పనిచేయాలన్నా.. పదేపదే ఫోన్ స్క్రీన్‌ను చూడాల్సి వస్తుంది. అలాకాకుండా, మీ మాటలతోనే మీ స్మార్ట్ పనులన్నీ చేయగలిగే ఓ ఏఐ పరికరం ఉంటే!? ఆ ఆలోచనతోనే Looki L1 ప్రాణం పోసుకున్నది. స్మార్ట్ వాచీలు, ఫోన్లకు భిన్నంగా.. కేవలం వాయిస్, ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బుల్లి ఏఐ వేరబుల్ డివైజ్.. ఇదో రియల్ టైమ్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది.
ఇందులోని అత్యాధునిక ఏఐ సాంకేతికత.. మీరు చెప్పింది వింటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఏదైనా అడిగితే.. వెంటనే సమాధానం ఇస్తుంది. రిమైండర్లు సెట్ చేస్తుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు వేరే భాషల్లోని మాటలను విని.. వాటిని మీ భాషలోకి అనువదించి చెబుతుంది. ఇందులోని కెమెరా ఫొటోలు, వీడియోలు తీయడమే కాదు.. వస్తువులను గుర్తించడం, టెక్ట్స్‌ను స్కాన్ లాంటి పనులెన్నో చేసేస్తుంది. ఇక చిన్న సర్క్యులర్ డిస్ప్లే.. నోటిఫికేషన్లు, ఏఐ ప్రతి స్పందనలను చూపిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటల వరకూ పనిచేస్తుంది.
ధర: రూ.18,000
దొరుకుచోటు: looki.ai వెబ్సైట్

పెరటితోట మరింత అందంగా కనిపించాలంటే.. లైటింగ్ ఉండాల్సిందే! అయితే, అక్కడిదాకా వైరింగ్, లైటింగ్ కోసం చాలా ఖర్చవుతుంది. కానీ, BRITSPEAR Solar Light Outdoor Gardenఉంటే.. పని తేలికవుతుంది. వీటికి ఎటువంటి వైరింగ్, ప్లగ్ పాయింట్లు అవసరం లేదు. కేవలం కావాల్సిన చోట అతికిస్తే సరిపోతుంది. ఈ లైట్లు అవుట్డోర్ గార్డెన్ డెకరేషన్తోపాటు సెక్యూరిటీలోనూ ముందుంటాయి. తోటలతోపాటు కాంపౌండ్ వాల్స్కూ మరింత లుక్‌ను జోడిస్తాయి.
వీటిలో ఆటోమేటిక్ సెన్సర్లు ఉంటాయి. పగలు సూర్యరశ్మి ద్వారా చార్జ్ అవుతాయి. రాత్రి కాగానే.. వాటంతట అవే వెలుగుతాయి. కాబట్టి, వైరింగ్, స్విచ్‌ల గోల ఉండదు. ఇక ఐపీ 65 వెదర్‌ప్రూఫ్ రేటింగ్ వల్ల.. వర్షంలో తడిసినా, ఎండకు ఉన్నా ఏమీకాదు. క్లాసిక్ మెటల్ ఫినిషింగ్, స్టయిలిష్ గ్లాస్ డిజైన్లలో లభిస్తున్నాయి.గార్డెన్ వాకింగ్ ట్రాక్ వెంట అమర్చితే.. రాత్రివేళ దారి స్పష్టంగా కనిపిస్తుంది.
ధర: రూ.719 (8 లైట్ల సెట్)
దొరుకుచోటు: అమెజాన్

ఇంట్లో లైటింగ్ ఆటోమేషన్ కోసం చూస్తున్నారా? పాత స్విచ్ బోర్డులనే.. ‘స్మార్ట్’గా మార్చాలని అనుకుంటున్నారా? అయితే.. wipro smart switch moduleపై ఓ లుక్ వేయాల్సిందే! ఇంట్లో ఇప్పటికే ఉన్న సాధారణ స్విచ్‌లను కూడా ‘స్మార్ట్’గా మార్చే అద్భుతమైన పరికరం ఇది. ఈ మాడ్యూల్‌ను పాత స్విచ్ బోర్డ్ వెనుక భాగంలో అమర్చితే సరిపోతుంది. అంతా ‘స్మార్ట్’గా మారిపోతుంది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో పనిచేస్తుంది. అంటే.. మీరు మాటలతోనే ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లను నియంత్రించవచ్చు.
లైట్లు ఏ టైమ్‌లో ఆన్ కావాలి, ఎప్పుడు ఆఫ్ కావాలి అనేదానికి టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. Wipro Next Smart Home యాప్ ద్వారా.. ప్రపంచంలో ఎక్కడి నుండైనా స్విచ్‌లను ఆన్/ఆఫ్ చేయవచ్చు. సాధారణంగా 10A వరకూ లోడ్‌ను తట్టుకుంటుంది. ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, టీవీలకు ఈ లోడ్ సరిపోతుంది. ఏసీలు, గీజర్లకు ప్రత్యేకమైన హెవీ డ్యూటీ మాడ్యూల్స్ అవసరం పడతాయి.
ధర: రూ. 1,799
దొరుకుచోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ఆపిల్ ప్రియులు ఐఫోన్‌తోనే సరిపెట్టుకోరు. ఆపిల్ వాచీ, ఎయిర్ బడ్స్ కూడా కొనేస్తారు. అయితే, వాటికి చార్జింగ్ పెట్టడానికి మూడు చెరువుల నీళ్లు తాగుతారు. డెస్క్పైనా తగినంత స్థలం చాలక ఇబ్బంది పడతారు. కానీ, ఈ Satechi 3-in-1 Qi2 Wireless Charging Station ఇంట్లో ఉంటే.. మూడింటికీ ఒకేసారి చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ 3-ఇన్-1 ఫోల్డబుల్ వైర్లెస్ ఛార్జింగ్ స్టాండ్.. ఇంట్లో, ఆఫీసులో, ప్రయాణంలో ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది.
ఇందులో సరికొత్త క్యూఐ2 వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ఉంది. ఇది మ్యాగ్‌సేఫ్ మాదిరిగానే 15W వేగంతో ఐఫోన్‌ను చార్జ్ చేస్తుంది. చార్జింగ్ స్టేషన్‌గానే కాకుండా.. చూడముచ్చటైన స్టాండ్‌గానూ పనిచేస్తుంది. దీని పవర్ అడాప్టర్‌లో US, EU, UK ప్లగ్ ఆప్షన్లు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో దాదాపు ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
ధర: 31,624
దొరుకుచోటు: అమెజాన్