రంగుల హోలీ అంటే సందడి, సంతోషం, ఆనందం! కానీ, ఈ సంబురాల్లో మీ స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు నీటిలో తడిసి, రంగుల మరకలతో పాడయ్యే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. రంగుల కేళీని ఎంచక్కా ఆస్వాదించొచ్చు. మీ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌కు వాటర్‌ప్రూఫ్ రక్షణ కల్పించి హోలీని ఎంజాయ్ చేయండి.