తెల్లవారగానే మధ్యాహ్నం అయిపోతున్నట్టు అనిపిస్తున్నది ఎండ. మనకే కాదు, మనం ప్రేమగా పెంచుకునే పిల్లులు, కుక్కలదీ ఇదే పరిస్థితి. పైగా వాటి శరీరం మీద బొచ్చు ఉండటం వల్ల వేడికి మరింత ఇబ్బంది పడతాయవి. ఎండవేళ మూగజీవులకు కాస్త ఉపశమనం కలిగించే ఉద్దేశంతో తయారవుతున్నవే ‘పెట్ కూల్ మ్యాట్’లు. వీటి మీద పడుకుంటే చల్లగా ఉండి శరీరం సేదతీరుతుంది. దీని మీద వాడే వస్త్రం, లోపలి కూలింగ్ జెల్ ప్యాడ్లు వాటంతట అవే చల్లబడిపోతాయి.
ఇందులో నీళ్లు పోయడం లేదా ఫ్రిజ్లో పెట్టడం లాంటి అవసరాలేమీ ఉండవు. ఏదైనా దుమ్ము చేరినా తడి వస్త్రంతో తుడిస్తే శుభ్రమైపోతుంది. సాదాగా ఉండే వాటితోపాటు రంగురంగుల్లో నిమ్మ, కివీ, పుచ్చకాయలాంటి పండ్ల ముక్కల ప్రింట్లతోనూ ఇవి వస్తున్నాయి. ఇంకేం, కళ్లకు అందం… పప్పీకి సౌకర్యం… ఒకదాంట్లో రెండూ అన్నమాట!