Intercourse: రెగ్యులర్ శృంగారంతో ఎన్ని లాభాలో తెలుసా..?
Intercourse: శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. ఈ భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృం

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. ఈ భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలయికగా భావిస్తారు. అలాంటి వారికి శృంగారంవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి శృంగారం దోహదపడుతుందని అంటున్నారు. మరి శృంగారం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందామా..?
Intercourse: శృంగారంతో ఆయువు పెరుగుతుందట
- శృంగారంవల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. హృదయ సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయట.
2. మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదించే వారిలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయట. వారిలో మతిమరుపు దరి చేరదట. మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట.
3. క్రమం తప్పని శృంగారం గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్న వారికి ఒక ఔషధంలా పనిచేస్తుందట. గుండె రోగులు వారానికి ఒకసారైనా శృంగారాన్ని ఆస్వాదిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట. మరణాల రేటు కూడా తగ్గుతుందట.
4. పరిశోధకులు 65 ఏండ్లలోపు వయసున్న వారిని ఎంపిచేసుకుని, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు.
5. ఆ రిపోర్టు ప్రకారం.. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 37 శాతం తగ్గగా, వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 38 శాతం తగ్గిందట.
6. ఇక వారానికి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొనని వారిలో మరణాల రేటు కేవలం 28 శాతం మాత్రమే తగ్గిందట. దీన్నిబట్టి శృంగారంతో ఆయువు కూడా పెరుగుతుందని నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Health
- Intercourse
- Life Span
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

