గోడలకు ఆహ్లాదకరమైన రంగులు వేయిస్తారు. ఆకర్షణీయమైన ఫొటోలు పెడతారు. వీలైతే హ్యాంగింగ్స్ జోడిస్తారు. వీటికి అదనంగా.. ఓ కొత్త ఆప్షన్.. క్యాప్షన్! గోడ మీద ‘మీరు మాకెంతో ప్రత్యేకం’ అని అర్థం వచ్చే మాట అతిథుల పట్ల మన ఆదరాన్ని తెలియజేస్తుంది. ఇంటికి వచ్చినవారికంతా ‘ఇదిగో ఇక్కడే మేం కబుర్లు చెప్పుకొనేది’ అని ప్రత్యేకంగా వివరించాల్సిన పన్లేదు. ‘దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్’ అనే క్యాప్షన్ ఆ బాధ్యత తీసుకుంటుంది. నిద్రలోకి జారుకునే ముందు జీవిత భాగస్వామికి ముత్యమంత ముద్దివ్వాలనే సంగతే మర్చిపోతున్నారా? ఏం ఫర్వాలేదు. దానికీ ఓ క్యాప్షన్ ఉంది.. ‘ఆల్వేస్ కిస్ మీ.. గుడ్నైట్’! టాయిలెట్, డ్రెసింగ్ రూమ్, కిచెన్.. ఇలా గదికి తగిన పలుకులు ఉన్నాయి. భాషను, భావుకతను ఇష్టపడేవారికి ఈ ట్రెండ్ తప్పక నచ్చుతుంది.
House Decarate1