బెంగళూరుకు చెందిన విభా హరీష్‌ది చింతల్లేని కుటుంబం. 16 ఏండ్ల వయసులో ఆమెకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య ఉన్నట్టు గ్రహించారు. చాలా సామాన్యమైనదిగా కనిపించే ఈ హార్మోన్ సమస్య నిజానికి ఎంతో చిరాకు కలిగిస్తుంది. రుతుక్రమంలో మార్పుల నుంచి, సంతానలేమి వరకు ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. విభా తల్లి ఒక వైద్యురాలు కావడంతో, ఈ సమస్యకు శాశ్వతమైన చికిత్స ఉండదనీ.. ఆహారపు అలవాట్ల ద్వారా చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చనీ గ్రహించారు.
ఆ దిశగా అధ్యయనం చేస్తూ అసలు సమతుల ఆహారాన్ని తనే ఎందుకు మార్కెట్ చేయకూడదని అనుకున్నారు. అలా మొదలైందే కాస్మిక్స్. హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ నుంచి జుత్తు రాలడం వరకు చాలా సమస్యలను నియంత్రించే దిశగా పోషకాహారాన్ని అందిస్తున్నారు ఆమె. అనతి కాలంలోనే కాస్మిక్స్ వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. విభా తన వ్యాపార దక్షతతో పెట్టుబడుల రియాలిటీ షో… షార్క్ ట్యాంక్ న్యాయనిర్ణేతల మనసును కూడా గెలుచుకుంది. కోటి రూపాయల పెట్టుబడిని అందుకుంది. దక్షిణాది నుంచి ముంబయికి చేరుకుని, అక్కడివారిని ఒప్పించడం కష్టమైనా అసాధ్యంగా తోచలేదు అంటారు విభా. ప్రతిభకు ప్రాంతీయ పరిమితులు ఉండవు కదా!