వేసవి మొదలైంది. మండే ఎండ.. ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. చర్మానికి, జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే, అందాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనీ, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలని అంటున్నారు బ్యుటీషియన్లు.
వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా.. చర్మం, జుట్టు నిర్జీవంగా మారుతాయి. పొడి చర్మం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపుతుంది. జుట్టుకూ మేలుచేస్తుంది.