బేబీ పొటాటో: అరకిలో
మునగాకు: కప్పు
కారం: స్పూను
జీలకర్ర పొడి: అరస్పూను
నూనె: మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ఆలుగడ్డలను కడిగి ఉడికించి, చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలి. బాణట్లో టేబుల్ స్పూన్ నూనెవేసి అందులో కడిగిన మునగాకును వేసి పచ్చిపోయే దాకా వేయించి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక వేళ మునగాకు దొరకకపోతే ఒక అరకప్పు ఎండబెట్టిన ఆకు పొడి అయినా ఫర్వాలేదు. ఇది అయితే నేరుగా వాడుకోవచ్చు. ఇప్పుడు మూకుట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఈ చిన్న ఆలుగడ్డలను ఉప్పు చల్లి ఎర్రగా వేయించాలి. తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న మునగాకు లేదా మునగాకు పొడిని ఇందులో వేసి కలపాలి. తర్వాత కారం, జీలకర్ర పొడులు కూడా జోడించి బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. వెరైటీ రుచిలో బేబీ పొటాటో కూర సిద్ధమైనట్లే!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు