న్యూఇయర్‌కు చేసిన తీర్మానాలు ఏమయ్యాయి? ఫాలో అవుతున్నారా? మధ్యలోనే వదిలేశారా?
new year decisions | స్మోకింగ్‌కు దూరం, మందుకు రామ్రామ్, వాకింగ్‌కు జై, డైటింగ్‌కు సై.. పక్షం రోజుల క్రితం పార్టీ చేసుకుంటూ తీసుకున్న తీర్మానాల సంగతేమిటి? ఓ అంచనా ప్రకారం.. ఇరవై ఐదు శాతం మంది జనవరి చివరి వరకు మాత్రమే కొత్త సంవత్సర తీర్మానానికి కట్టుబడి ఉంటారు.
new year decisions | స్మోకింగ్‌కు దూరం, మందుకు రామ్రామ్, వాకింగ్‌కు జై, డైటింగ్‌కు సై.. పక్షం రోజుల క్రితం పార్టీ చేసుకుంటూ తీసుకున్న తీర్మానాల సంగతేమిటి? ఓ అంచనా ప్రకారం.. ఇరవై ఐదు శాతం మంది జనవరి చివరి వరకు మాత్రమే కొత్త సంవత్సర తీర్మానానికి కట్టుబడి ఉంటారు. తొలివారంలోనే చేతులెత్తేసేవారు నలభై ఎనిమిది శాతం. ఒక్కోనెల గడిచేకొద్దీ.. ఎంతో కొంతమంది అస్త్ర సన్యాసం చేస్తారు. డిసెంబరు-2023 వరకూ అంతే ఉత్సాహంగా, అదే పట్టుదలతో కట్టుబడి ఉండేవారు ఎనిమిది శాతమే. ఆ కొద్దిమందిలో మీరూ ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
పెద్ద లక్ష్యాలను చిన్నగా విభజించుకోండి. ఏడాదిలో పది కేజీల బరువు తగ్గాలన్న తీర్మానం మంచిదే. కానీ, దాన్ని పది ముక్కలు చేసుకుని.. నెలకు ఒక కేజీ తగ్గినా చాలని అనుకుంటే.. తేలిక అవుతుంది. ఒక నెల కుదరకపోయినా, ఇంకోనెల సాధిస్తాం. ఏడాది చివరికి ఏడెనిమిది కిలోలు వదిలించుకోవడం ఖాయం.
కోటీశ్వరుడు కావాలనే కోరిక కాదనలేనిదే. కానీ, వంద లక్షలు పోగైతేనే కోటి అవుతుంది. కాబట్టి, నెలనెలా ఎంత పొదుపు-మదుపు చేయాలనే విషయంలో స్పష్టత పెంచుకోండి. గాలిమేడలు వద్దు.
సిగరెట్ మానేయాలన్న నిర్ణయానికి అభినందనలు. ఆ ప్రయత్నంలో చిన్నచిన్న వైఫల్యాలు ఎదురైనా పట్టించుకోకండి. ఉదాహరణకు కొంతమంది.. స్నేహితుల బలవంతంతోనో, వ్యసనం తాలూకు బలహీనత కారణంగానో.. సిగరెట్ ముట్టిస్తారు. ఎలాగూ మళ్లీ మొదలుపెట్టాం కదా అని.. పాత అలవాటే కొనసాగిస్తారు. ఇది తప్పు. ఆ అనుభవాన్ని పాఠంలా మాత్రమే తీసుకోవాలి. పట్టుదలతో ముందుకెళ్లాలి.
మనసు చాలా శక్తిమంతమైంది. ఆ శక్తిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోండి. మీ సంకల్పబలాన్ని పెంచుకోండి. ఆ ప్రయత్నంలో ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ ఓ పది నిమిషాలు మీ ఆలోచనలను గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. దీనివల్ల మీరు వేరు, మీ ఆలోచనలు వేరు అన్న ఎరుక సాధ్యం అవుతుంది. తీర్మానానికి కట్టుబడి ఉండాలన్న పట్టుదల
పెరుగుతుంది.
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలనుకోవడం మంచి తీర్మానమే. అంతలోనే, ‘నాకు సమయం లేదు’, ‘పుస్తకం చదివితే కంటికి శ్రమ’, ‘పుస్తకాల రేట్లు బాగా పెరిగిపోయాయి’, ‘అయినా చదవదగిన పుస్తకాలు ఎక్కడొస్తున్నాయి?’.. తరహా సాకులతో ఓ మంచి అలవాటును మూలనపడేయకండి. ఏ వాకింగ్లోనో ఆడియో బుక్స్ వినండి. ధర ఎక్కువనిపిస్తే సెకండ్స్లో ప్రయత్నించండి. కొత్త పుస్తకాలలో సరుకు లేదనిపిస్తే.. క్లాసిక్స్ ఎంచుకోండి. మనసుంటే మార్గం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరి మద్దతు అవసరం అవుతుంది. నిపుణుల సలహా తప్పనిసరి కావచ్చు. బరువు తగ్గే విషయంలో డైటీషియన్ అభిప్రాయం తీసుకోండి. వ్యసనాలు వదలకపోతే మానసిక నిపుణులను సలహా అడగండి. తీర్మానం అమలులో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడండి.
స్నేహితులు, బంధువులు, కొలీగ్స్‌లో మీలాంటి తీర్మానమే తీసుకున్న వాళ్లు కొందరైనా ఉంటారు. అంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించండి. లక్ష్యాలు, గెలుపులు, సవాళ్లు
..మనసులోని భావాలన్నీ పంచుకోండి.
చివరగా ఒక మాట. మీ పరిధిలోలేని విషయాల జోలికి వెళ్లకండి. ఫలానా అమ్మాయిని ప్రేమించాలనో, పెండ్లి చేసుకోవాలనో తీర్మానిస్తే మూర్ఖత్వమే అవుతుంది. మీ తీర్మానం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయలేదు.
Read More :
“persons of the year | 2022లో సాటిలేని మేటి వ్యక్తులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు వీళ్లే”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

