ఎయిర్ హోస్టెస్ల కోసం.. సరికొత్త ఆహార్యాన్ని పరిచయం చేస్తున్నది ఎయిర్ ఇండియా సంస్థ. ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా వీటిని డిజైన్ చేశారు. భారతీయ సంప్రదాయానికి పాశ్చాత్య పోకడల్ని జోడించి ప్రాణం పోశారు. ‘ఈ దుస్తుల్ని ధరించినందుకు సిబ్బంది గర్వపడాలి. వారి చేతుల మీదుగా ఆతిథ్యం అందుకుంటున్నందుకు ప్రయాణికులు
మురిసిపోవాలి’ అంటారు మనీశ్.