ఫోర్బ్స్ బిలియనీర్‌గా 91 ఏండ్ల జాస్తి సుబ్బమ్మ
భారతదేశ అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా జాస్తి సుబ్బమ్మ రికార్డు సృష్టించారు. పోయిన నెలలో ఫోర్బ్స్ జాబితాలోకి అడుగుపెట్టిన సుబ్బమ్మ.. ప్రస్తుత నికర సంపద సుమారు రూ.91.9 వేల కోట్లు (1.1 బిలియన్ డాలర్లు).
భారతదేశ అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా జాస్తి సుబ్బమ్మ రికార్డు సృష్టించారు. పోయిన నెలలో ఫోర్బ్స్ జాబితాలోకి అడుగుపెట్టిన సుబ్బమ్మ.. ప్రస్తుత నికర సంపద సుమారు రూ.91.9 వేల కోట్లు (1.1 బిలియన్ డాలర్లు). ఆమె భర్త జాస్తి సుబ్బారావు గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. దీంతో ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కూడా సుబ్బమ్మ పేరు మీదకు బదిలీ అయ్యాయి. దీంతో ఆమెకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
సువెన్ ఫార్మాస్యుటికల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాస్తి వేంకటేశ్వర్లు సుబ్బమ్మ తనయుడు కావడం విశేషం. 2022లో సువెన్ ఫార్మాస్యుటికల్స్లోని గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ.. అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు తమ వాటాను విక్రయించింది. ఇందులో పెద్దమొత్తం సుబ్బమ్మకు వచ్చినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ 2,653వ స్థానంలో ఉంది. ఇక భారతీయ బిలియనీర్లలో సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

