మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - Jun 15, 2020 , 00:31:17

ఎస్టీపీపీ సమీపంలో పులి సంచారం !

ఎస్టీపీపీ సమీపంలో పులి సంచారం !

జైపూర్‌ : మండలంలోని వివిధ ప్రాంతాల్లో పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 15 రోజుల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి బెల్లంపల్లి, రామ కృష్ణాపూర్‌ మీదుగా జైపూర్‌ మండలానికి ప్రవే శించిన పెద్దపులి ముదిగుంట గ్రామ శివారులో నాలుగు రోజుల పాటు సంచరించింది. అక్కడి నుంచి ఆర్కే 7 గని మ్యాగజైన్‌ ప్రాంతంలోకి రావ డంతో ఎస్‌అండ్‌పీసీ వారు చూశారు. రామ గుం డం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ శ్రీరాం పూర్‌ పోలీసులు, అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతంలో పర్యటించి ఆన వాళ్లను పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధి కారు లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానికులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. పులికి ఎలాంటి హాని కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు వన్యప్రాణులను వేటా డే వారి వివరాలు సేకరించి జైపూర్‌ పోలీస్‌ స్టేష న్‌లో బైండోవర్‌ చేశారు. 

శనివారం రాత్రి పెద్దపులి జైపూర్‌ విద్యుత్‌ కేంద్రం సమీపంలో రైల్వేట్రాక్‌ వెంట గూడ్స్‌ రైల్వే గార్డు కంటబడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జైపూర్‌ విద్యుత్‌ కేంద్రంలో పులి సంచరించినట్లు పుకార్లు రావడంతో కార్మిక వర్గం, అధికారులు భయాందోళనకు గురయ్యా రు. జైపూర్‌ సమీప అటవీ ప్రాంతం గుండా భీమారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీక రించడం లేదు.logo