సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత ప్రధానమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై విద్యార్థులకు...
ఖమ్మం రూరల్, అక్టోబర్ 09 : సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత ప్రధానమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకు అధికారులమని ఫోన్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం, నకిలీ లింకులు పంపడం, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపించడం, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.
కొందరు వ్యక్తులు పోలీసులమని, ఇతర ప్రభుత్వ అధికారులమని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి డబ్బులు పంపవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవడం, అనధికారిక యాప్‌లను డౌన్లోడ్ చేయడం, ఇతరులకు ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలని, రెండు దశల ధృవీకరణ (టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్) సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ, సైబర్ నేరాల నివారణకు పోలీసుల చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
కళాశాల విద్యార్థులు తమకు తెలిసిన సైబర్ భద్రతా అంశాలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన లేని కుటుంబ సభ్యులకు తగిన సూచనలు చేయాలని అన్నారు. సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సదస్సులో సైబర్ సెక్యూరిటీ విభాగ ఏసీపీ ఫణింద్ర, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట చలపతి, ఖమ్మం రూరల్ కూసుమంచి, నెలకొండపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కళాశాల డీన్ డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

