ఎర్రుపాలెం. ఆగస్టు 22 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని గంగ దేవరపాడు కట్లేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని పురుషుడి మృతుదేహం లభ్యమైనట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఎవరైనా గుర్తించిన ఎడల ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ నంబర్ 8712659165 లేదా ఎస్ఐ నంబర్ 8712659164 కు ఫోన్ చేసి తెలుపాల్సిందిగా పేర్కొన్నారు.