కొత్తగూడెం సింగరేణి, జనవరి 2: సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్‌కు సోమవారం హెడ్డాఫీస్‌లోని తన ఛాంబర్లో సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీఎం పర్సనల్ (ఐఆర్ అండ్ పీఎం) ఆనందరావు ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు, నాయకులు మాల కొండయ్య, జీఎం ఈఅండ్ఎం వైజీకే మూర్తి, సాయికృష్ణ, మురళీ, విజేందర్ పాల్గొన్నారు.
రామవరం, జనవరి 2: సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా) చంద్రశేఖర్‌కు ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హెడ్డాఫీస్‌లోని డైరెక్టర్ ఛాంబర్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రామవరం, జనవరి 2: సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్‌ను ఏరియా జీఎం జక్కం రమేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట డీజీఎం పర్సనల్ సామ్యూల్ సుధాకర్, ఎస్ఎస్వో రమణారెడ్డి ఉన్నారు.