రఘునాథపాలెం, మార్చి 7: ఖమ్మం నగరం ఇల్లెందు రోడ్డు కైకొండాయిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరాజు రావమ్మల తిరునాళ్ల జాతర మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైంది. ఐదు రోజుల పాటు పండుగలా జరిగే ఈ జాతరకు తొలిరోజున భక్తులు వేలాదిగా తరలివచ్చారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మేయర్ పునకొల్లు నీరజ హాజరై కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డిలతో కలిసి తొలి రోజు జాతరను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్, ప్రధాన కార్యదర్శి సూరంశెట్టి నర్సింహారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కోశాధికారి గుండోజు రామాచారి, సభ్యులు వెంకటేశ్వర్లు, రామారావు, పాపారావు, గాదె రాంబాబు, రమేశ్‌బాబు, వరలక్ష్మి, మల్సూరు, జనార్దనాచారి, కృష్ణ, మురళీధరరావు, సుందర్ తదితరులు పాల్గొన్నారు.