కారేపల్లి కేజీబీవీలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల ప్రత్యేక అధికారిని జీ.ఝాన్సీ సౌజన్యతో కలిసి ఉపాధ్యాయులు,విద్యార్థులు పాఠశాల డైరెక్టర్ వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు..
కారేపల్లి, ఆగస్టు 29 : కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల ప్రత్యేక అధికారిని జీ.ఝాన్సీ సౌజన్యతో కలిసి ఉపాధ్యాయులు,విద్యార్థులు పాఠశాల డైరెక్టర్ వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు, భాషావేత్త గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. తెలుగు భాష వ్యవహారిక రూపం రావడానికి గిడుగు వారి కృషి ఎనలేనిదన్నారు. తల్లి లాంటి తెలుగు భాషను మనం ఎప్పటికి మరవరాదన్నారు. తెలుగు భాష గ్రాంధిక రూపం నుంచి వ్యవహారిక రూపం రావడానికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి మరవరాదన్నారు.

కారేపల్లి కేజీబీవీలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం
గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన మాతృభాష పద్యాల పోటీని ఆమె తిలకించి విద్యార్థులను ప్రశంసించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అనంతరం బాలికలు నిర్వహించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీహెచ్.ఝాన్సీ, ఎం.విజయలక్ష్మి, ఎం.స్వాతి, జి.అన్నపూర్ణ, జి.విజయ, మమత పాల్గొన్నారు.

కారేపల్లి కేజీబీవీలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

