టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు నిరసనకు దిగారు. సత్తుపల్లిలో ప్ల కార్డులు, నల్ల జెండాలు, నల్ల కండువాలతో ర్యాలీ నిర్వహించారు. నేలకొండపల్లిలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, వైరా కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు మందడపు మధుసూదన్‌రావు చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
– నమస్తే నెట్వర్క్
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 15: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారం చేతిలో ఉందని ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడే ప్రజలు హర్షిస్తారని, అందుకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, చుంచుపల్లి ఎంపీపీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుఅశ్వారావుపేట, సెప్టెంబర్ 15: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయపరమైన వేధింపులు సరికాదన్నారు. కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేయించారని, ఆయనపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాను ఖండిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా ప్రజల మద్దతుతో గెలవాలే తప్ప, కక్షపూరితంగా వ్యవహరించి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించడం దారుణమన్నారు.
సత్తుపల్లి/ నేలకొండపల్లి, సెప్టెంబర్ 15: ఏపీ మాజీ సీఎం, అక్కడి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని, జైలుకు పంపిందని నందమూరి, నారా అభిమానులు ఆరోపించారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ నందమూరి, నారా అభిమానులు సత్తుపల్లిలో శుక్రవారం మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని మాధురి ఫంక్షన్‌హాల్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నందమూరి, నారా అభిమానులు చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, మట్టా ప్రసాద్, పువ్వాళ్ల ఉమ, దొడ్డా శంకర్రావు, వల్లభనేని పవన్, కొంగర రమేశ్, పోట్రు సరస్వతి, వడ్లపట్ల ఫణి, కొల్లు శ్రీను, బొంతు శ్రీను, మోరంపూడి ప్రభాకర్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు సంఘీభావంగా పాల్గొన్నారు. అదేవిధంగా, నేలకొండపల్లిలోనూ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
వైరాటౌన్, సెప్టెంబర్15: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు మందడపు మధుసూదన్‌రావు అన్నారు. శుక్రవారం కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కమ్మవారి కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును సంఘ సభ్యులు తీవ్రంగా ఖండించారు. విజయో లీడర్‌గా సమైక్య రాష్ర్టాన్ని అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారని కొనియాడారు. సమావేశంలో చింతనిప్పు వెంకటయ్య, కట్టా కృష్ణార్జున్‌రావు, దామా వీరయ్య, పొడపాటి నాగేశ్వరరావు, సూర్యదేవర శ్రీధర్, శ్రీరామినేని విజయభాస్కర్, కొమ్మినేని అశోక్, కర్నాటి హనుమంతరావు, పొదిల హరినాధ్, సూర్యదేవర శ్రీమంతు, తన్నీరు సాగర్ పాల్గొన్నారు.