ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్ కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జీ కోల్టే,
- కౌంటింగ్ టేబుళ్ల వద్ద మైక్రో పరిశీలకులు
- ఖమ్మం ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం రూరల్, జూన్ 3 : కౌంటింగ్ కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జీ కోల్టే, కౌంటింగ్ పరిశీలకుడు ప్రేదిమాన్ కృష్ణన్ భట్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి హాల్లో 14 కౌంటింగ్ టేబుళ్లు, ఖమ్మం అసెంబ్లీకి 18 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశామని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, బీ.సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం.రాజేశ్వరి, జీ.గణేశ్, ఎల్.రాజేందర్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఏజెంట్లకు పాస్‌లు తప్పనిసరి
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అభ్యర్థుల ఏజెంట్లు విధిగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్‌లతో రావాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోమవారం మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓట్ల లెక్కింపునకు ఏడు హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. అదనంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ఒక హాల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా, అలాగే ఖమ్మం, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వేస్టేషన్, సత్తుపల్లి, మధిర, వైరా బస్టాండ్లలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 6 గంటలకే రావాలని, పార్టీల ప్రతినిధులు 5 గంటల వరకు రావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు ఏజెంట్లు వెంట తీసుకరావొద్దన్నారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

