అశ్వారావుపేట, ఫిబ్రవరి 6: స్థానిక వ్యవసాయ కళాశాలలో అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం టెన్నీకాయిట్లో అశ్వారావుపేట, సిరిసిల్ల కళాశాలల జట్లు తలపడ్డాయి. అశ్వారావుపేట జట్టు గెలుపొందింది. ఫుడ్ అండ్ టెక్నాలజీ-రుద్రూర్, అశ్వారావుపేట జట్ల మధ్య జరిగిన పోటీలో అశ్వారావుపేట విజయం సాధించింది. ఫుట్‌బాల్ పోటీల్లో ఆదిలాబాద్, సిరిసిల్ల జట్లపై అశ్వారావుపేట జట్టు గెలుపొందింది.
పాలెం, జగిత్యాల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో జగిత్యాల గెలుపొందింది. వాలీబాల్‌లో సంగారెడ్డి, రాజేంద్రనగర్ జట్లను అశ్వారావుపేట జట్టు ఓడించింది. డిస్కస్‌త్రో, జావెలిన్, 200 మీటర్ల పరుగు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.