చుంచుపల్లి, సెప్టెంబర్ 22: భద్రాద్రి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చుంచుపల్లి మండలం విద్యానగర్‌కాలనీ ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూం ఆదివారం అట్టహాసంగా శుభారంభమైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సినీ తారలు నేహాశెట్టి, పాయల్ రాజ్‌పుత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కస్టమర్ల ఆరంభ ఆఫర్‌గా అన్ని వెరైటీలపై కాస్ట్ టూ కాస్ట్ సేల్‌ను ఆవిష్కరించారు. అనంతరం షోరూమ్‌లోని అన్ని వయసులు, తరాల అభిరుచులకు సరితూగే విస్తృత శ్రేణికి చెందిన కలెక్షన్స్ గురించి నేహాశెట్టి మాట్లాడారు. కొత్తగూడెంలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఆవిష్కరణలో భాగం కావడం పట్ల గొప్ప అనుభూతి కలుగోందని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. వస్ర్తాలంకరణకు సంబంధించి మంచి అభిరుచులు కలిగిన కొత్తగూడెం వాసులు ఈ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌లోని విస్తృత శ్రేణి వస్ర్తాలతో రాబోయే పండుగలు, వివాహ వేడుకలను సంతోషంగా జరుపుకుంటారని ఆకాంక్షించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, విద్యానగర్ కాలనీ మాజీ సర్పంచ్ గోవింద్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బదావత్ శాంతి, ఎన్కేనగర్ మాజీ సర్పంచ్ బదావత్ సుగుణ తదితరులు హాజరయ్యారు. షాపింగ్‌మాల్ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినవ్, రాకేశ్, కేశవ్, సిబ్బంది పాల్గొన్నారు.