ఖమ్మం, ఆగస్టు 7: పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని నిలిపివేయాలని, పాలస్తీనా దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలని, వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం నగరంలో వేలాది మందితో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్డీ తదితర పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు, జర్నలిస్టు, ముస్లిం మైనార్టీ, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు, ప్రైవేట్ సూళ్లు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
మైనార్టీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండాలతో సంఘీభావం ప్రదర్శిస్తూ సేవ్ గాజా అనే నినాదంతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మార్చ్ ఫర్ హ్యూమానిటీ పేరుతో గాజాలో పాలస్తీనా జాతి హననానికి ఇజ్రాయెల్ చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు. తక్షణమే యుద్ధాన్ని ఆపివేయాలని, గాజాలో ఆహార పదార్థాలు, మందులు, మానవతా సాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, సీపీఐ నాయకులు అజీజ్ పాషా, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ప్రైవేట్ సూళ్లు, కాలేజీల యాజమాన్యాలు మువ్వా శ్రీనివాసరావు, కాంతారావు, వీరారెడ్డి, శేషగిరి,
మతీన్, రవిమారుత్, రమణారావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు, ఐఎంఏ అధ్యక్షుడు కంభంపాటి నారాయణరావు, జీవీ జగదీశ్, రవీందర్, నాగమణి, గోపీనాథ్, న్యాయవాదులు జకంపూడి నాగేశ్వరరావు, బిచ్చాల తిరుమలరావు, శేషగిరి, విప్లవకుమార్, కాంగ్రెస్ నాయకుడు మొకా శేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తాజుద్దీన్, షకీనా, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ, వెంకటేష్, ప్రవీణ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.