కారేపల్లి, మార్చి 27 : సింగరేణి (కారేపల్లి) మండల తాసీల్దార్ అనంతుల రమేశ్ బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కల్లూరు సబ్ కలెక్టర్ లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేసిన రమేష్ డిప్యూటేషన్ పై సింగరేణి మండల తాసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్‌ను రద్దుచేసి తిరిగి కల్లూరు సబ్ డివిజన్ కార్యాలయానికి పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగరేణి తాసీల్దార్‌గా నేలకొండపల్లి తాసీల్దార్ వి.వెంకటేశ్వర్లు డిప్యూటేషన్ పై సింగరేణి తాసిల్దారుగా రానున్నారు.