పూల పండుగ..
ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. వాటిపై గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంబరాన్నంటిన సద్దుల సంబురం
- ఘాట్లు, చెరువులు, కుంటల వద్ద మహిళలు, యువతులు, చిన్నారుల సందడి
- సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ ఆటపాటలతో మారుమోగిన పల్లె, పట్నం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29 : ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. వాటిపై గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం బతుకమ్మలతో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఘాట్లు, చెరువులు, కుంటల వద్దకు చేరుకొని చుట్టూ బతుకమ్మలను పెట్టి.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ ‘చిత్తూ చిత్తూల బొమ్మ.. శివునీ ముద్దుల గుమ్మ..’ అంటూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ సంబురంగా సద్దుల బతుకమ్మ సందడి చేశారు. పొద్దుపోయిన తర్వాత భక్తిప్రపత్తులతో బతుకమ్మలను చెరువులు, కుంటలల్లో నిమజ్జనం చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకొని, తమ వెంట తెచ్చుకున్న ప్రసాదాలను ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. సంబురంగా ఇంటిబాట పట్టారు.
తెలంగాణ భవన్లో ఘనంగా ‘సద్దుల బతుకమ్మ’
- ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సత్యవతి, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా
ఖమ్మం, సెప్టెంబర్ 29: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ నిమజ్ఞనం కోసం కార్యాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేశారు.

సోమవారం నాటి సద్దుల బతుకమ్మ వేడుకలను బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు, పగడాల శ్రీవిద్య, బెల్లం ఉమ, భారతి, బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్ తదితరులు ప్రారంభించారు. గౌరీదేవి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడి నిమజ్జనం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

