గురుకుల విద్యార్థులకు నాణ్యమైన బోధన
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలను, పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
- రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్
మామిళ్లగూడెం/ కొణిజర్ల, ఏప్రిల్ 22: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలను, పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఉన్నత విద్యారంగాల్లో రాణించేలా వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయన.. కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి రఘునాథపాలెం, తణికెళ్ల, దానవాయిగూడెం గురుకులాలను సందర్శించారు.
మొదటగా రఘునాథపాలెం గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాన్ని, అనంతరం కొణిజర్ల మండలం తణికెళ్లలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దానవాయిగూడెం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కృష్ణ నాయక్, ఏటీడీవో ఎన్.తిరుమలరావు, మైనింగ్ శాఖ ఏడీ సంజయ్‌కుమార్, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు మానస, ప్రజ్ఞా ఐశ్వర్యరాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

