Constitution | రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి: ప్రిన్సిపల్ జేమ్స్ చాకో
విద్వాన్ పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కారేపల్లి,నవంబర్ 26 : ఖమ్మం జిల్లా కారేపల్లిలోని విద్వాన్ పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రెవ. జేమ్స్ చాకో మాట్లాడుతూ..భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తుందని పేర్కొన్నారు.రాజ్యాంగంలోని విలువలు, సూత్రాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
కేరళ రాష్ట్రానికి చెందిన మధు,మనోజ్ పి.థామస్,పి.ప్రిన్స్ లాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రాముఖ్యత, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరుల బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీలిన్ జేమ్స్,కే.శ్రీజ,కె.రేణుక,జె. జ్యోతి,కేజీ స్మిత,రసీనా,ఏ. పవిత్ర, జి. ఉమా, బోడ కృష్ణవేణి,బి.స్వరూప,వి. రజిని,టి.స్వరూప, అమీలియా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

