కారేపల్లి, ఆగస్టు 19 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కారేపల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కారేపల్లి మండల ఫొటోగ్రాఫర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తోటి ఫొటోగ్రాఫర్ చింత రాధాకృష్ణ అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. ఫొటోగ్రాఫిక్ పక్రియ అభివృద్దికి పాటుపడిన లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి వై.సైదిరెడ్డి, బి.ప్రసాద్, లక్ష్మణ్, సిలివేరు ఆదినారాయణ, పాపారావు పాల్గొన్నారు.