పట్టా ఉన్నా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే..
అక్రమంగా లేఔట్లు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసినవారు, ఇండ్లు నిర్మించుకున్నవారు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) ఫీజు చెల్లించాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు కంటే ముందు వెంచర్లు, లే ఔట్లలో స్థలం కొనుగోలు చేసిన వారందరూ స్టాంప్ డ్యూటీ చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా గృహ యజమానులకు అవకాశం కల్పించింది.
- కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారికి గుదిబండ!
- 1985కంటే ముందు ఇంటిపన్ను రశీదు ఉండాల్సిందే..
- లేదంటే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఫీజు తప్పదు
- ఆందోళనలో ఇంటి యజమానులు
కొత్తగూడెం అర్బన్, మే 15 : అక్రమంగా లేఔట్లు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసినవారు, ఇండ్లు నిర్మించుకున్నవారు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) ఫీజు చెల్లించాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు కంటే ముందు వెంచర్లు, లే ఔట్లలో స్థలం కొనుగోలు చేసిన వారందరూ స్టాంప్ డ్యూటీ చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా గృహ యజమానులకు అవకాశం కల్పించింది. కానీ కొత్తగా మున్సిపల్ అధికారులు మరో నిబంధనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ 373, 76 జీవోల ద్వారా ఇంటి క్రమబద్ధీకరణ పట్టాలు పొందినవారు సైతం కొత్తగా ఇండ్లు నిర్మించుకోవాలనుకుంటే భవన నిర్మాణ అనుమతి ఫీజుతోపాటు ఎల్ఆర్ఎస్ ఫీజు సైతం చెల్లించాలని చెబుతున్నారు. దీంతో టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు.
పట్టా ఉన్నా ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సిందే…
కొత్తగూడెం మున్సిపాలిటీ తొలుత నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపాలిటీగా 2000 సంవత్సరంలో రూపాంతరం చెందింది. అప్పటివరకు ఇంటిపై ఎవరికి యాజమాన్య హక్కులు సైతం ఇంటి యజమానులకు లేవు. అవసరానికి ఇండ్లు అమ్ముకుందామన్న, పిల్లల పెళ్లిళ్ల కోసం, పై చదువులకోసం రుణాలు తీసుకుందానుకున్న, వారసత్వంగా ఆస్తిని ఇవ్వాలనుకున్న ఎటువంటి హక్కులు ఉండేవికావు. ఇండ్లను క్రమబద్ధీకరించాలని అనేక పోరాటాలు చేయగా 2007లో 373 జీవో ద్వారా ఆనాటి ప్రభుత్వం ఇంటి క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేసింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 76ద్వారా మరోమారు మిగిలి ఉన్న ఇండ్లకు క్రమబద్ధీకరణ పట్టాలు ఇచ్చారు. తద్వారా మొత్తం సుమారు 15వేల ఇండ్లకు రెగ్యులరైజ్ చేస్తూ క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ కొత్తగా ఇప్పుడు ఇంటిని నిర్మించుకునేవారు మరోసారి ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవాలని దానికి రుసుము చెల్లించాలని చెప్పడంతో గృహ యజమానులు అవ్వాకవుతున్నారు.
1985కంటే ముందు పన్ను రశీదు ఉండాల్సిందే…
కొత్తగా ఇంటిని నిర్మించుకుందామని గృహ యజమానులు టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే 21రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేలాగా గత ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చింది. ఇంటి క్రమబద్ధీకరణ పట్టా ఉన్నవారు పాత ఇంటిస్థానంలో దానిని కూల్చి కుటుంబ అవసరాల నిమిత్తం కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే ప్రస్తుతం టీఎస్ బీపాస్‌లో భవన నిర్మాణ అనుమతి ఫీజుతోపాటు ఎల్ఆర్ఎస్ ఫీజును సైతం చెల్లించాల్సిందిగా ప్రస్తుతం మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. 1985కంటే ముందు ఇంటిపన్ను రశీదు ఉంటే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రశీదు లేకుంటే కచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలంటున్నారు. 200 గజాల్లో జీ ప్లస్ వన్‌కు అనుమతి తీసుకోవాలంటే సుమారు 40వేలు ఫీజు చెల్లించాల్సి ఉండగా ఇక ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా అప్పటి భూమి విలువ ప్రకారం చెల్లించాలంటే సుమారు లక్షకు పైగానే అవుతోంది. ఫలితంగా ఇండ్లు నిర్మించుకోవాలంటే సుమారు రెండులక్షల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని గృహ యజమానులు వాపోతున్నారు.
కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారికి ఇబ్బందే..
భవన నిర్మాణ అనుమతికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా చెల్లించాలంటే ఇంటి యజమానులకు ఆర్థిక భారం తప్పదు. 1985నాటి ఇంటి పన్ను తీసుకురావాలంటే సాధ్యమయ్యేపని కాదు. దాదాపు 40సంవత్సరాల క్రితం రశీదు తేవడం కుదిరేపని కాదు. ప్రతి రశీదును ఇంట్లో భద్రపరుచుకోవడం కష్టమైన పని. ఇప్పుడు రశీదు అధికారులకు అందజేయనిపక్షంలో బీఆర్ఎస్, ఎల్ఆర్ఎఫ్ ఫీజు కట్టడమంటే ఎంతలేదన్న సుమారు లక్షన్నర వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతపెద్దమొత్తంలో ఆర్థిక భారం మోపడం మున్సిపల్ అధికారులకు తగదు. దీనిపై అధికారులు పునరాలోచన చేయాలి. ప్రజాప్రతినిధులు సైతం దృష్టిసారించి ఇంటిని నిర్మించుకునేవారికి ఉపశమనం కల్పించాలి.
– చావా సంగారావు, సింగరేణి ఉద్యోగి
రశీదు లేకుంటే ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సిందే..
కొత్తగా ఇంటిని నిర్మించుకునేవారు బిల్డింగ్ అనుమతి ఫీజుతోపాటు 1985 కంటే ముందు రశీదు కూడా అధికారులకు అందజేయాలి. రశీదు లేనిపక్షంలో ఎల్ఆర్ఎస్ ఫీజు కచ్చితంగా చెల్లించాల్సిందే. మున్సిపాలిటీకి ఇంటి పన్నులు మినహా ఇతర ఆదాయ వనరులేవీ లేవు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. రశీదు లేని వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
– టి.శేషాంజన్‌స్వామి, మున్సిపల్ కమిషనర్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

