ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 6వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9399320222 నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.