Khammam | పార్టీ పటిష్టతే లక్ష్యంగా నూతన గ్రామకమిటీలు…

కల్లూరు: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా శనివారం గ్రామాల్లో నూతన గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, రైతుసమన్వయ సమితి జిల్లా, మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ నూతన కమిటీలను, అనుబంధ కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 10వ తేదీలోగా గ్రామకమిటీలను పూర్తిచేసి మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నాయకులు పార్టీ పటిష్టతను దృష్టిలో ఉంచుకుని సమిష్టి నిర్ణయాలతో కమిటీలను ఏకగ్రీవం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్నకోరుకొండి, తెలగవరం, మర్లపాడు, పోచారం, తాళ్లూరు వెంకటాపురం గ్రామాల గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తాళ్లూరు వెంకటాపురం గ్రామశాఖ అధ్యక్షునిగా మరీదు శ్రీనివాసరావు, కార్యదర్శిగా కందిమళ్ల సుదర్శనం, తెలగవరం గ్రామకమిటీ అధ్యక్షులుగా పాటి రామారావు, కార్యదర్శిగా నీలం వెంకటేశ్వర్లు, మర్లపాడు అధ్యక్షునిగా జగదభి సీతారామరాజు, కార్యదర్శిగా గర్నెపూడి పిచ్చయ్యలతో పాటు చిన్నకోరుకొండి, పోచారం గ్రామాల్లో నూతన కమిటీలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

