27 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి అనుక్షణం పర్యవేక్షించారు.
- వారితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ
- సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
ఖమ్మం, జూలై 27 : ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి అనుక్షణం పర్యవేక్షించారు. మున్నేరు వరద ఉధృతి పెరగడంతో మైక్‌తో అప్రమత్తం చేస్తూ ఇళ్లల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొకలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. ఇళ్లలో, మేడపై మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పద్మావతి నగర్‌లోని ధ్యాన మందిరంలోని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం రెండో అంతస్తులో బిక్కు బిక్కు మంటూ భయాందోళనలో ఉన్న మునగాటి లక్ష్మీనారాయణ, మునగాటి లక్ష్మీదేవి, మునగాటి యశ్వంత్, ప్రవళ్లిక, అరవింద్, కావ్య, విఘ్నేష్ 5 నెలల బాబుతోపాటు బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్‌కు చెందిన 20మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడను, కలెక్టర్, సీపీలను కౌగిలించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సాయిరెడ్డి అనే వ్యక్తి వెళ్లి వారు చిక్కుకున్న స్థలాన్ని చూపించారు. విద్యుత్ లేకపోవడంతో టార్చి లైట్ల సహకారంతో వారిని రక్షించారు. వారు ఒడ్డుకు చేరుకోగానే స్థానికులు పెద్ద సంఖ్యలో జై పువ్వాడ.. అంటూ నినాదాలు చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

