ఖమ్మం :ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 11వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ లెప్టినెంట్ కల్నల్ సమీత్ ఆధ్వర్యంలో వార్షిక ట్రైనింగ్ క్యాంప్-3ని ప్రారంభించారు. 10 రోజుల పాటు శిక్షణ కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు. శిక్షణలోభాగంగా విద్యార్థులకు పలు అంశాల్లో మెళకువలు నేర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మృగేషన్, డాక్టర్ జరుపుల రమేష్,శ్రీలత, శైలజాభేగం తదితరులు పాల్గొన్నారు.