ఖమ్మం రూరల్, జూన్ 14 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిదిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మద్దినేని వెంకటేశ్వరరావు అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆచార్య ఎన్.సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో “డైనమిక్ రిసోర్స్ అలకేషన్ అండ్ లోడ్ బాలెన్సింగ్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను అన్నామలై విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.
శనివారం కళాశాలలో వెంకటేశ్వరరావును కళాశాల చైర్మన్ డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాదిపతి ఇంజం నరసింహారావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.గోపాల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.రామారావు, అకడమిక్ డైరక్టర్ట్స్ అట్లూరి.వెంకటరమణ, ఎం.శివకుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.