సీతారామ ప్రాజెక్టుతో సస్యశ్యామలం
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుంచపర్తి, అమ్మపాలెం, వెంకటాపురం, కందుకూరు, భరిణెపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు
- పల్లెప్రగతితో మెరుగుపడిన గ్రామాలు
- నిరుపేదలకు భరోసా ఆసరా పింఛన్
- పేదరికమే గీటురాయిగా సంక్షేమ పథకాలు
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వేంసూరు, సెప్టెంబర్ 22 : సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుంచపర్తి, అమ్మపాలెం, వెంకటాపురం, కందుకూరు, భరిణెపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతితో పల్లెలు మెరుగు పడుతున్నాయన్నారు. నిరుపేదలకు భరోసా కల్పించేసేందుకే ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. పేదరికమే గీటురాయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వేంసూరు, తిరుమలాయపాలెం మండలాల్లో భూగర్భజలాలు సరిగా లేక కరువు మండలాలుగా ఉండేవని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఎన్టీఆర్ కాలువను సత్తుపల్లి నుంచి వేంసూరు వరకు నిర్మించి నీరందించారన్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని, తద్వారా సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికే బుగ్గపాడు వద్ద కాల్వ పనులు పూర్తి కావొచ్చాయని, ఈ కాల్వను బేతుపల్లి చెరువుకు అనుసంధానం చేస్తే ఎన్టీఆర్ కాలువ ద్వారా బేతుపల్లి చెరువు నుంచి వేంసూరు మండలానికి నీరు చేరుతుందన్నారు. కందుకూరు గ్రామానికి చెందిన బండి కృష్ణకుమారి బ్లాక్‌ఫంగస్‌తో రూ.లక్షలు ఖర్చు చేశారని, వారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరోసా కల్పిస్తూ రూ.8 లక్షల చెక్కు అందించామన్నారు. కందుకూరులో 26 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.2.60 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మీ, తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో రంజిత్‌కుమార్, పీఆర్ ఏఈ వాసుదేవరావు, ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

