చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగాధర్ మాట్లాడుతూ మున్నేరులో ఇసుక నిల్వలు, నీటి సామర్ధ్యం,లభ్యత తదితర అంశాలను పరిశీలించామని తెలిపారు. సదరు నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఎండీసీ పీవో.యల్లయ్య, ఇరిగేషన్ ఈఈ సీహెచ్ రామకృష్ణ, ముదిగొండ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.