బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
- అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
- బీఆర్ఎస్లో పలు కుటుంబాలు చేరిక
అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, నవంబర్ 30: మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన బానోత్ రత్నకిషోర్, నునావత్ అనూషదేవి, బానోత్ రాము, మిటియా, కాకా వెంకటేష్, పాయం శేఖర్, ప్రసాద్, మూర్తితో 30 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వారికి మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విస్మరిస్తున్నదని, కేవలం దోపిడీ, స్కాంలకు మాత్రమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ మంచిరోజులు రావాలంటే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించి కేసీఆర్‌కు, రాష్ట్ర భవిష్యత్‌కు దన్నుగా నిలవాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ మాయమాటలకు మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, ప్రజలకు మంచి చేసేందుకు బీఆర్ఎస్ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ ఎంపీపీ బరగడ కృష్ణ, మండల అధ్యక్షుడు జుజ్జూరు వెంకన్నబాబు, మండల నాయకులు మందపాటి రాజమోహన్‌రెడ్డి, చందా లక్ష్మీనర్సు, గుడవర్తి వెంకటేశ్వరరావు, నారం రాజశేఖర్, మిండా దుర్గారావు, కొప్పుల రాంబాబు, పద్దం శ్రీను, సోమ్లా, మోహన్, అశోక్, రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా నందిపాడు గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు గొంది మంగరాజు- అలివేలు దంపతులు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

