కారేపల్లి, ఆగస్టు 31 : కారేపల్లి – ఇల్లెందు రహదారిపై ఉన్న కారేపల్లి రైల్వే గేటు సోమవారం మొరాయించింది. రైల్వే గేటులో సాంకేతిక లోపం తలెత్తడంతో మూతపడిన గేటు ఎంతకు తెరుచుకోలేదు. దీంతో కారేపల్లి – ఇల్లెందు వెళ్లు ప్రయాణికులు అవస్ధలు పడ్డారు. గంట వరకు గేటు తెరుచుకోక పోవడంతో వాహనాదారులు సూర్యతండా, అప్పాయిగూడెం మీదుగా రాకపోకలు సాగించారు. తర్వాత రైల్వే ఇంజినీరింగ్ అధికారులు గేటు తెరుచుకోవడంతో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించటంతో గేటు తెరుచుకుంది. నిత్యం గంట గంటకు రైల్వే గేటు పడి ప్రయాణికులు, వాహదారులు అవస్ధలు పడుతున్న క్రమంలో రోడ్ ఓవర్ బ్రిడ్జీ (ఆర్వోబీ) నిర్మాణం చేయాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.