అట్టడుగుకు పాలేరు నీటిమట్టం
పాలేరు రిజర్వాయర్‌లో ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి ఇబ్బందులు మరోసారి ఉత్పన్నమయ్యాయి.
- తాగునీటికి మరో పది రోజులకు మాత్రమే జలాలు
- ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజల డిమాండ్
కూసుమంచి, ఫిబ్రవరి 24: పాలేరు రిజర్వాయర్‌లో ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి ఇబ్బందులు మరోసారి ఉత్పన్నమయ్యాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా శనివారం నీటి మట్టం 13.5 అడుగుల మేరకు ఉంది. ఇప్పుడు ఉన్న నీటి నిల్వలు మరో 10 రోజుల అవసరాలకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకానికీ జలాలు సరఫరా చేయలేని దుస్థితి. వచ్చేది వేసవి కావడంతో మున్ముందు నీటి అవసరాలు మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. ఆయా జిల్లాలకు ఒక్కరోజు శుద్ధజలం సరఫరా చేయాలంటే ప్రాజెక్ట్‌లో 126.5 క్యూసెక్కుల నీరు ఉండాలి. కానీ మున్ముందు అన్ని క్యూసెక్కుల నీరు అందడం దుర్లభం. ఇప్పటికే సాగర్ ఆయకట్టులో సాగు చేస్తున్న పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎగువ నుంచి ఒకటి రెండు తడులకు నీరు విడుదలైతే తప్ప పంటలు చేతికందలేని దైన్యం. అలాగే జలాశయంలో ఉన్న నీరు ఆవిరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమైనా చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. దీనిపై ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరగా.. ప్రభుత్వం ఇప్పటికే నీటి ఎద్దడిపై సమీక్షలు నిర్వహించిందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశపై మరింత స్పష్టత రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రజల తాగునీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రప్రభుత్వం శ్రీరాంసాగర్ నుంచి జలాలను మళ్లించి పాలేరు జలాశయానికి తీసుకురావాల్సిందే. లేదా కేఆర్ఎంబీ అనుమతులు తీసుకుని సాగర్ నుంచి జలాశయానికి నీరు తీసుకోవాలి. సర్కార్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

