ఆడపిల్ల.. అదృష్టానికి చిరునామా
ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు.
- కృషి, పట్టుదల మహిళల విజయానికి సూచికలు
- సంక్షేమ పథకాలు, షీ టీంలు మహిళలకు వరాలు
- మహిళా దినోత్సవంలో మేయర్, ట్రైనీ ఐపీఎస్
ఖమ్మం వ్యవసాయం, మార్చి 12: ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మహిళలు పురుషులతోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు, షీటీం వంటి వ్యవస్థలు మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా నిలిచాయని గుర్తుచేశారు.
అనంతరం ట్రైనీ ఐపీఎస్ మౌనిక మాట్లాడుతూ.. సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే ఆర్థిక వనరులతో పనిలేదని, కేవలం కృషి, పట్టుదల ఉంటే సరిపోతుందని అన్నారు. అవి మాత్రమే మహిళలకు విజయసోపానాలుగా నిలుస్తాయని అన్నారు. బాలికలు ముఖ్యంగా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయా రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను అధికారులు సత్కరించారు. తరువాత కేజీబీవీలు, టీఎస్ఆర్జీసీ విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫాతిమా జోహార్, భారతీరాణి, భూలక్ష్మి, నీలోహన, కవిత, కమలప్రియ, బాలాత్రిపురసుందరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

