వైరా, సెప్టెంబర్ 9 : వైరా మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ స్నేహలత సందర్శించారు. పిల్లల బరువులు, ఎత్తులను తూచి పెరుగుదలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, కౌన్సిలర్ ఉష, ఎంపీడీవో వెంకటపతిరాజు, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ హిమబిందు, సీడీపీవో శారదాశాంతి, మాలతికుమారి, ఏడబ్ల్యూటీ జ్యోతి పాల్గొన్నారు.