అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
అర్హులైన పేదలు, బలహీన వర్గాల వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ మిత్రపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
– పాల్గొన్న బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నేతలు
ఎర్రుపాలెం, అక్టోబర్ 22 : అర్హులైన పేదలు, బలహీన వర్గాల వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ మిత్రపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి ఇళ్లు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ఇళ్లు ఇస్తామని కొందరు నాయకులు చెప్పడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను లాటరీ పద్ధతిలో, పార్టీలకు అతీతంగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా పారదర్శకంగా లాటరీ నిర్వహించి అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్రా నరసింహారావు, కోటా లోకేష్, మధిర మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు, కార్పొరేటర్ యన్నంశెట్టి అప్పారావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, రాయబారపు పుల్లారావు, కంచం గోపి, బొగ్గుల వీరారెడ్డి, ఆళ్ల నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- cpi
- CPM
- Indiramma houses
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

