మణుగూరు టౌన్, నవంబర్ 24: యూటీఎఫ్ జిల్లా మహాసభల బ్రోచర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం మణుగూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 4న మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా 4వ మహాసభలో గౌరవ అధ్యక్షుడిగా పాల్గొనాలని ఆయనను యూటీఎఫ్ నాయకులు ఆహ్వానించారు. మహాసభల బ్రోచర్‌ను రేగా కాంతారావు ఆవిష్కరించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాము, నాయకులు షేక్ మీరా హుస్సేన్, కారం సీతారామయ్య, జి.కిరణ్ శ్రీనివాస్, బానోత్ భాస్కరరరావు పాల్గొన్నారు.
మండలంలోని గుట్ట మల్లారం పంచముఖ వేదగాయత్రీ దేవస్థానంలో గురువారం జరిగిన అయ్యప్ప దీక్షాపరుల ఇరుముడి కార్యక్రమానికి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు.
సారపాక, నవంబర్ 24: సారపాకలోని బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం పరామర్శించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్, వల్లూరిపల్లి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.