రంగుల కేళి..హోలీ
హోలీ.. రంగుల కేళి. మనస్సు నిండా ఆనందాన్ని నింపే సంబురం. చిన్నాపెద్ద, పేదాధనిక తేడాలేకుండా స్నేహభావంతో రంగులు చల్లుకునే కలర్‌ఫుల్ వేడుక. మనుషులంతా ఒక్కటే అనే సందేశమిచ్చే పండుగ.
- కలర్‌ఫుల్ వేడుకకు ప్రజలు సిద్ధం
- నేడూ, రేపు హోలీ పౌర్ణమి సంబురాలు
- సహజ రంగులే ఆరోగ్యానికి మేలు
హోలీ.. రంగుల కేళి. మనస్సు నిండా ఆనందాన్ని నింపే సంబురం. చిన్నాపెద్ద, పేదాధనిక తేడాలేకుండా స్నేహభావంతో రంగులు చల్లుకునే కలర్‌ఫుల్ వేడుక. మనుషులంతా ఒక్కటే అనే సందేశమిచ్చే పండుగ. రంగులను ప్రేమగా ఒకరికొకరు ముఖాలకు పులుముకుంటూ వీధుల్లో చేసే సందడి అంతాఇంతా కాదు. అయితే ఈసారి కొంతమంది ఆదివారం, మరికొందరు సోమవారం హోలీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రసాయన రంగులు వద్దని, సహజరంగులే ఆరోగ్యానికి మేలని ఎప్పటిలాగే వైద్యులు సూచిస్తున్నారు.

కొత్తగూడెం టౌన్/ సారపాక, మార్చి 23 : హోలీ సంబురాలను జరుపుకునేందుకు ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని కాముడిదహనం, రంగులు చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హోలీ హోలీల రంగ హోలీ.. చమ్మకేలిల హోలీ అంటూ పాటలు పాడుకుంటూ చిన్నాపెద్దా కలిసి వేడుకల్లో పాల్గొననున్నారు. క్యాలెండర్లో ఆది, సోమవారాలు హోలీ వేడుకలు ఉండడంతో కొంతమంది ఆదివారం, మరికొంతమంది సోమవారం వేడుకలు జరుపుకోనున్నారు.
కాముడిదహనం చేయనున్నారు. సింగరేణి ఏరియాలో ప్రభుత్వ సెలవు సోమవారం కావడంతో హోలీ సంబురాలు జరగనున్నాయి. యువత రంగులను కొనుగోలు చేసే పనిలోపడ్డారు. కాలనీల్లో ఒకచోట అందరూ చేరి హోలీ రంగులు పూసుకుంటూ డీజే పాటలకు స్టెప్పులేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ స్నేహితులతో ఒక్కరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు రెడీ అయ్యారు.
హోలీ పురాణమిదే..
హోలీ పుట్టుకను తెలిపే పురాణ గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. హోలిక అనే రాక్షసి తాను నివసించే పరిసర ప్రాంతాల్లో ఉండే పిల్లలను ఎత్తుకువెళ్లి తినేస్తుంటుంది. దీంతో ఆ ప్రాంతవాసులు హోలికను కాల్చి చంపుతారు. ఆనాటి నుంచి హోలిక పేరు మీద హోలీని జరుపుకోవడం ఆనవాయితీ.

కామదహనం
హోలీకి ముందు అర్ధరాత్రి ‘కామదహనం’ అనాదిగా వస్తున్న ఆచారం. శరీరంలో రోగాలన్నీ మటుమాయమై అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని ఆశిస్తూ ఇంట్లోని పాత వస్తువులు, కలపను, పేడతో చేసిన పిడకలను కూడళ్ల వద్దకు చేర్చి కామదహనం చేస్తారు. మిగిలిన బూడిదను దిష్టి తగలకుండా బొట్టుగా పెట్టుకుంటారు.
మోదుగు పూలరంగు
ప్రాచీనకాలంలో రంగుల కోసం మోదుగుపూలు వాడేవారు. ఇవి చర్మానికి ఎంతో శోభ తెచ్చేవి. మోదుగు పూలతో రంగులు తయారు చేసుకుని హోలీకేళిని జరుపుకునేవారు. మోదుగు పూలు ఈ కాలంలో వచ్చే రోగాలకు కూడా దివ్యమైన ఔషధం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

