ఖమ్మం, ఫిబ్రవరి 1: కొలాబ్ ఫైల్స్ ఎన్ఐసీ వెబ్ ఆప్లికేషన్పై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ప్రభుత్వ పని సులభతరం అవుతుందని అడిషనల్ స్టేట్ ఇన్ఫర్మేటిక్స్ అధికారి (ఏఎస్‌ఐవో) ర్యానిల్ జాన్, సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ (ఎస్టీడీ) రాకేశ్ పేరొన్నారు. అంతేకాకుండా డేటా సురక్షితంగా ఉంటుందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించడం వల్ల కార్యాలయాల్లో పని వేగవంతంగా పూర్తవుతుందని అన్నారు. నూతన కలెక్టరేట్లోని జిల్లా వివిధ శాఖల సిబ్బందికి కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్‌పై గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్లో పరిచయ్, జన్ పరిచయ్ అనే రెండు యూజర్లు పొందుపర్చి ఉన్నాయని అన్నారు. పరిచయ్ యూజర్ అనేది సింగిల్ సైన్ ఆన్ ద్వారా ఈ మెయిల్ ఐడీతో ప్రభుత్వ శాఖల ఫైల్స్ వినియోగానికి సులభతరంగా ఉంటుందని అన్నారు.
ఫైల్స్, ఫోల్డర్స్, మెయిల్స్ చేసే అవకాశం ఉంటుందని, ఇవన్నీ గోప్యంగా ఉంటాయని, సైబర్ హ్యాకింగ్ జరుగకుండా సురక్షితంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వం జారీచేసిన డిజిటల్ ఐడెంటిటీతోపాటు సహకార డాక్యుమెంటేషన్ వంటి ఆఫీస్ ఈ-ఫైలింగ్ ఫైల్స్ విధానం ఎకువ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇక జన పరిచయ్ అప్లికేషన్ అనేది ప్రైవేటు యూజర్ వన్‌స్టాప్ ప్రమాణీకరణ సొల్యూషన్ అని అన్నారు. వినియోగదారుల వివరాలు, ఫైళ్లు, ఫోల్డర్లు సృష్టించి నిర్వహించుకోవచ్చని వివరించారు. ఇది పరిశ్రమల అనుకూల ఫార్మెట్లకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఎన్ఐసీఐటీ మేనేజర్ విజయ్ ప్రకాశ్, జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి రాంప్రసాద్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్ఐసీ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.