మిర్చి రైతులకు పరిహారమివ్వండి
మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
- రైతు సంఘం ఆధ్వర్యంలో మధిర తహసీల్ ఎదుట బాధిత రైతుల ధర్నా
మధిర రూరల్, జూలై 20: మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు, బాధిత రైతులు పలువురు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు నెలలు గడుస్తున్నా.. మిర్చి నిల్వ చేసి నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వానకాలం సీజన్, విద్యాసంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులకు, పిల్లల చదువులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని, బీమా ప్రతినిధులతో చర్చించి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేశ్, కన్వీనర్ దివెల్ల వీరయ్య, సీతారాంరెడ్డి, నాయకులు మడిపల్లి గోపాలరావు, మందడపు ఉపేంద్ర, పడకంటి మురళి, బాధిత రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

