వైరాటౌన్, ఆగస్టు 4: ఎలాంటి తీర్మానం లేకుండా నీటి పన్ను బకాయిలను వసూలు చేస్తున్నారని, వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వార్డు కౌన్సిలర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు కట్టా స్వరూపరాణి, తిరుపతి శివకుమారి, చిలకా చిన్న కోటయ్య, కిన్నెర కృష్ణ, మాదినేని సునీత, దుర్గాప్రసాద్, నల్లమోతు శైలజ, జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎనిమిదేళ్ల క్రితం నీటి పన్ను వసూళ్లు జరగలేదని చెబుతూ.. మూడేళ్ల బిల్లులను ఒకేసారి వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఆన్లైన్ ద్వారా బిల్లులు వసూలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం కౌన్సిల్ తీర్మానం లేకుండా నీటి బిల్లులు ఎలా వసూలు చేస్తారని కమిషనర్‌ను ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. ఆన్లైన్ బిల్లులు వచ్చే వరకు వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు మద్దెల రవి, అప్పం సురేష్, బానోతు సక్కుబాయి, మాదినేని దుర్గాప్రసాద్, నూకల వాసు, పుల్లయ్య, పాసంగులపాటి శివ, బత్తుల రాజు, కొత్తా నర్సింహారావు, మాచర్ల శంకర్, నర్సింహారావు, కట్ల నాగేశ్వరరావు, వేముల శివకృష్ణ, రంజాన్, వదినేపల్లి చక్రవర్తి, గుగులోతు బాబు, వీరన్న, రేచర్ల సైదులు, వల్లెపు రాము పాల్గొన్నారు.