ధరణి పెండింగ్‌పై కసరత్తు
పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిషరించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించిన విషయం విదితమే.
- వారంలో సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు
- సాదా బైనామాలను తిరస్కరిస్తున్న అధికారులు
- కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసుల్లో ఉన్నవి పరిష్కారం
- ధరణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే రెండో స్థానం
- ఖమ్మం అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్
మామిళ్లగూడెం, జూన్ 22 : పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిషరించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ రెవెన్యూ సిబ్బందితో దరఖాస్తుల పరిషారానికి చర్యలు చేపట్టారు. అయితే జిల్లావ్యాప్తంగా చాలా మంది రైతులు సాదా బైనామా డాక్యుమెంట్స్‌తో ఆన్లైన్ ద్వారా తమ సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత వచ్చిన 70 వేల సాదా బైనామా డాక్యుమెంట్స్‌తో ఉన్న దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. వివిధ స్థాయిల్లో కోర్టు కేసులలో పెండింగ్‌లో ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా.. వాటిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం పరిష్కరిస్తున్నారు.
తహసీల్దార్ విచారణ నివేదిక తర్వాత వారి నుంచి ఆర్డీవో ద్వారా అదనపు కలెక్టర్ లాగిన్ వచ్చిన ఫిజికల్ ఫైళ్లను క్షేత్రస్థాయి నివేదికలతో సరిపోల్చుకుంటూ పరిషరిస్తున్నారు. అదనపు కలెక్టర్ ఆమోదం తర్వాత కలెక్టర్ లాగిన్‌కు చేరుకున్న ఫైళ్లపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే షిఫ్టులవారీగా ఈ ప్రక్రియను కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో చేపట్టారు. ఇప్పటివరకు తహసీల్దార్ల లాగిన్‌లో 4,254, ఆర్డీవో లాగిన్‌లో 1,382, అదనపు కలెక్టర్ లాగిన్‌లో 1,556 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి రోజూ వీటిలో కొన్నింటిని పరిశీలించి పరిషరిస్తుండగా.. మండలాల నుంచి రోజుకు 200 ఫైళ్లు అదనపు కలెక్టర్ లాగిన్‌కు వచ్చి చేరుతున్నాయి. పెండింగ్ దరఖాస్తుల్లో.. డాటా కరెక్షన్(వివరాల సవరణ), టీఎం 33లో సర్వే నెంబర్లు, విస్తీర్ణం పేర్లు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలు తప్పుగా నమోదైనవి సవరించాలనే దరఖాస్తులు ఉన్నాయి.
పరిష్కారంలో రాష్ట్రంలోనే రెండో స్థానం
ధరణి వెబ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం భూ సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో ఖమ్మం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. దరఖాస్తుల పరిష్కారంలో 73 శాతం ఆమోదం పొందుతుండగా.. 27 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. కొణిజర్ల మండలంలో పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో సవరణలు కోరుతూ జిల్లాలో ఇప్పటివరకు 78,710 దరఖాస్తులు ఉండగా.. వాటిలో 57,101 ఆమోదించి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. మరో 13,269 తిరసరణకు గురయ్యాయి. వీటిపై మరోసారి విచారణ చేపట్టి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వాటిలో 8,340 పెండింగ్ దరఖాస్తులు కొణిజర్ల మండలంలోనే ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిషరించేందుకు ప్రయత్నిస్తామని, దీనికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పనులు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తెలిపారు. న్యాయస్థానంలో కేసులు ఉన్నవి, సాదా బైనామా దరఖాస్తులు తప్ప మిగతా అన్ని సమస్యలు వారంలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

