కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 1 : విద్యార్థులు, ప్రయాణికులతో కొత్తగూడెం బస్టాండ్ కిటకిటలాడింది. విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధవారం నుంచి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే హాస్టళ్లు, వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.
పిల్లలతోపాటు సామగ్రిని తీసుకొని బస్టాండ్‌కు చేరుకోవడంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. దీనికితోడు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో పిల్లలను తీసుకెళ్తున్న తల్లులు దాదాపు బస్సులోనే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురయ్యారు. ప్లాట్‌ఫాంపైకి వచ్చిన బస్సులను ఎక్కేందుకు పోటీపడ్డారు.