Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srivari Temple | ఖమ్మం జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఖమ్మం : ఖమ్మం ( Khammam) జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయ ( Srivari Temple ) నిర్మాణానికి టీటీడీ(TTD ) సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం 20.04 సెంట్ల భూమిని కేటాయించగా భూమికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం నిర్మాణం, పోటు (వంటశాల), ప్రాకారం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కావడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక ప్రచారానికి ఈ క్షేత్రం ప్రధాన కేంద్రంగా నిలవనుంది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీనివాసుడి కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అరిష్టాలు తొలగి, పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఎస్ఈ ఇన్‌ఛార్జి ఎస్. ప్రసాద్, డీఈ సురేంద్ర నాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ మల్లికార్జున, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

